15-04-2025 01:39:02 AM
హుజురాబాద్,విజయ క్రాంతి: ఏప్రిల్14: సీతా రామచంద్రస్వామిని దర్శించుకున్న పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఇల్లంతకుంట మండలంలో సోమవారం రామచంద్ర స్వామి రథోత్సవం లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ అర్చకులు ఆలయ కమిటీ ఆయనకు ఘన స్వాగతం పలికి స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు. తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట పెద్దపల్లి జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, సుల్తానాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ వినుపాలప్రకాష్ రావు, పత్కపల్లి సింగిల్ విండో చైర్మన్ సుమన్ రెడ్డి తోపాటు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు