పెద్దపల్లి,(విజయక్రాంతి): ఆ మల్లన్న దేవుని ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని శ్రీ మల్లిఖార్జున స్వామి నూతన ఆలయానికి భూమి పూజలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. సోమవారం ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలో శ్రీ.మల్లిఖార్జున స్వామి వారి నూతన దేవాలయ నిర్మాణం కోసం తెల్లవారుజామున భూపూజ, శిలాన్యాసం, శంఖుస్థాపనను సతీసమేతంగా ఎమ్మెల్యే పాల్గొని ఆలయ నిర్మాణ పనులను విజయరమణ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శివపల్లి గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.