భద్రాచలం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం వారి ఆధ్వర్యంలో దేవాలయం ఆవరణలో బుధవారం భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకటరావు ఉదయం 10 గంటలకు లాంఛనంగా ప్రారంభించి భక్తురాలికి రసీదు అందజేశారు. నూతనంగా ప్రారంభించిన డిజిటల్ సేవలు ద్వారా అన్నదానం, ప్రోటోకాల్, వస్త్ర సమర్పణ రసీదులు అందజేస్తారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, డిజిటల్ సేవ అధికారులు పాల్గొన్నారు.