భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పట్టణంలో పలు రోడ్లకు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు మంగళవారం శంకుస్థాపనలు చేశారు. అంబేద్కర్ సెంటర్ నుండి సిపిఐ ఆఫీసుకు వెళ్లే రహదారి, ఎల్ఐసి రోడ్డు నుండి క్రాంతి విద్యాలయం వరకు వెళ్లే రహదారితో పాటు పలు సిమెంట్ రోడ్లకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. గ్రామపంచాయతీ నిధుల నుండి మంజురైన నిధులతో ఈ రహదారుల నిర్మాణం చేపడుతున్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు తెల్లం వెంకటరావు మాట్లాడుతూ.. భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధి కోసం వెనకడుగు వేసేది లేదని భద్రాచలం పట్టణంలోని ప్రతి వీధిని సిమెంట్ రోడ్లుగా, డ్రైనేజ్ నిర్మాణాలు చేపడతానని తెలిపారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో భద్రాచలం గ్రామపంచాయతీ శ్రీనివాసరావు, సిపిఐ నాయకులు రావులపల్లి రవికుమార్, కాంగ్రెస్ నాయకులు భోగాల శ్రీనివాసరెడ్డి, తిరుపతిరావు రమాకాంత్, క్రాంతి విద్యానికేతన్ నిర్వహకులు సోమరైతు శ్రీనివాసరావు, సమత తదితరులు పాల్గొన్నారు.