calender_icon.png 22 April, 2025 | 12:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చౌడాలమ్మ దేవి కళ్యాణ మహోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే

21-04-2025 09:24:22 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రానికి చెందిన యాదవ సంఘం ఆధ్వర్యంలో వారి ఆహ్వానం మేరకు చౌడాలమ్మ దేవి కళ్యాణ మహోత్సవం కార్యక్రమానికి  కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సోమవారం హాజరైనారు. చౌడాలమ్మ దేవి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంకు వచ్చిన ఎమ్మెల్యేకు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో యాదవ సదరు సంఘం సభ్యులతోపాటు బిజెపి శ్రేణులు, గ్రామస్తులు పాల్గొన్నారు.