calender_icon.png 2 April, 2025 | 9:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే వెంకట్రావు

01-04-2025 01:35:03 PM

భద్రాచలం,(విజయ క్రాంతి): భద్రాచలం పట్టణంలో గిరిజన సహకార సంస్థ రేషన్ షాపులో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా  బియ్యం కాటా కు,  రేషన్ కార్డు వివరాలు రికార్డ్ చేసే కంప్యూటర్ మిషన్ కు పూజలు నిర్వహించిన అనంతరం జిసిసి అధికారులు, హాజరైన ప్రజల సమక్షంలో  పేద ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ నరసింహారావు కాంగ్రెస్ నాయకులు  భీమవరపు వెంకటరెడ్డి కొండిశెట్టి కృష్ణమూర్తి తో పాటు పలువురు అధికారులు అనాధికారులు పాల్గొన్నారు.