జిల్లాలో ఘనంగా క్రిస్మస్ పండగ వేడుకలు
ఆకట్టుకున్న యేసు జన్మ వృత్తాంతా సెట్టింగ్ లు
యేసుప్రభువు చూపిన మార్గంలో నడుచుకోవాలి : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
క్రైస్తవుల అభివృద్ధికి ప్రభుతం పెద్దపీట : ఎమ్మెల్యే బొజ్జు పటేల్
ఆదిలాబాద్,(విజయక్రాంతి): క్రైస్తవుల ఆరాధ్య దైవం యేసు ప్రభువు జన్మించిన రోజును పురస్కరించుకొని నిరహించే క్రిస్మస్ పండగ వేడుకలను బుధవారం ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు చర్చల్లో క్రిస్మస్ పండగ వేడుక సందడి నెలకొంది. రంగు రంగు విద్యుత్ దీపాలతో పలు చర్చి లను సరాంగ సుందరంగా అలంకరించారు. అదేవిధంగా ఏసుప్రభు జన్మించిన ఇతివృత్తాన్ని వివరించేలా ఏర్పాటు చేసిన పశువులపాక సెట్టింగ్ లు ఎంతగానో ఆకట్టుకున్నాయి. పండగ సందర్భంగా క్రైస్తవులచే చర్చి ఫాదర్ లు ప్రత్యేక ప్రార్థనలు చేయించారు.
అటు నేరడిగొండ మండల కేంద్రంలోని చర్చ్ లో నిరహించిన క్రిస్మస్ పండగ వేడుకల్లో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రైస్తవులతో కలిసి కేక్ కట్ చేసి అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ యేసుక్రీస్తు చూపిన శాంతి మార్గంలో ప్రతి ఒక్కరు నడుచుకోవాలన్నారు. ప్రపంచమంతా శాంతిని పంచాలని ఏసుప్రభువు సూచించిన విధంగా ప్రతి ఒక్కరూ ప్రపంచ శాంతి స్థాపనకై పాటుపడాలని కోరారు.
అదేవిధంగా ఉట్నూర్, దంతనపల్లి లోని సిఎస్‌ఐ, బేతేస్థా, మోరియా చర్చిలలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా చర్చిలలో ప్రత్యేక ప్రార్ధనలు చేసి, కేక్ కట్ పలువువురికి తినిపించారు. అనంతరం క్రైస్తవులకు పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ర్ట ప్రభుతం క్రైస్తవ సోదరులకు 100 శాతం రాయితీతో కూడిన సబ్సిడీ లోన్ లను తరలో ఇవనున్నట్లు తెలిపారు. ప్రేమ, దయ, కరుణామయుడైన యేసు ప్రభువు చల్లని దీవెనలు ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. రాష్ర్ట ప్రభుతం క్రైస్తవుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు.