ఆదిలాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ పటేల్ శనివారం సీఎం రేవంత్‌రెడ్డిని హైదరాబాద్‌లోని సచివాలయంలో కలిశారు. ఖానాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని సీఎంను ఎమ్మెల్యే కోరారు. ని యోజకవర్గంలోని ఆదివాసీల ఆరా ధ్య దైవం నాగోబా ఆలయ అభివృద్ధితో పాటు ఇంద్రవెల్లి, ఉట్నూర్, జ న్నారం, పెంబి, కడెం మండలాల్లో డబుల్ లేన్ రోడ్డు నిర్మాణ పనులకు నిధులు ఇవాలని కోరారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి నట్లు ఎమ్మెల్యే తెలిపారు.