calender_icon.png 7 January, 2025 | 1:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఆర్టీల ధర్నాను విరమింపజేసిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు

05-01-2025 10:55:42 PM

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ప్రజా ప్రభుత్వం సబ్బండ వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఉట్నూర్ మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట గత 20 రోజులుగా గిరిజన శాఖ సీఆర్టీ ఉపాధ్యాయులు చేపడుతున్న నిరవధిక సమ్మె శిబిరంకు ఆదివారం వెళ్లిన ఎమ్మెల్యే దీక్ష చేస్తున్న ఉపాధ్యాయులకు నిమ్మరసం ఇచ్చి సమ్మెను విరమింపజేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజన శాఖను పూర్తిగా విస్మరించిందన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ధర్నా చౌక్ లను ఎత్తివేసామని తెలిపారు. కొందరు బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాన్నారు. గత పది ఏళ్ళు అధికారంలో ఉండి ఏం చేశారో చెప్పాలన్నారు. జిల్లా ఇంచార్జీ మంత్రి సీతక్క దృష్టికి సీఆర్టీల సమస్యలను తీసుకెళ్లామని తెలిపారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి డిమాండ్లను పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీఆర్టీ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.