calender_icon.png 31 March, 2025 | 4:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి

28-03-2025 09:56:15 PM

మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డికి,  మంత్రి పదవి ఇవ్వాలని మునగాల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తక్కెళ్లపాటి సాయి డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాయి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుపొందిన మహిళా కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డికి, మంత్రి పదవి ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే  ఏకైక మహిళా ఎమ్మెల్యే అని  ఎటువంటి అవినీతి ఆరోపణలు లేనటువంటి ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అని ఈ సందర్భంగా కొనియాడారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ప్రత్యేక స్థానం కల్పించాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు.