12-04-2025 08:45:42 PM
మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి కోటి 50 లక్షలతో అధునాతన పరికరాలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పద్మావతి రెడ్డి మాట్లాడుతూ... ఈ హాస్పిటల్ నేషనల్ హైవే పక్కన ఉన్నది కాబట్టి, ఇప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా నడుస్తుంది. దీనిని త్వరలో 24/7 గంటల ఆస్పత్రిగా చేస్తామన్నారు. ఇంతకుముందు ఆక్సిడెంట్ అయితే పోస్టుమార్టనికి ఇబ్బంది ఉండేది. ఆ ఇబ్బంది లేకుండా ఇక్కడ పోస్టుమార్టం చేసేలా ఆదేశించారు.
ఇప్పుడు ప్రతి మనిషిలో షుగర్, బీపీ, క్యాన్సర్ ఎక్కువ అవుతున్నాయి, డయాలసిస్ ఇక్కడ చేసేటట్లు ఏర్పాటు చేస్తామన్నారు. హాస్పిటల్ సంబంధించి ఏ అవసరం కావాలన్నా వెంటనే మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సహకారంతో చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్వో కోటాచలం, ఆర్డీవో సూర్యనారాయణ ఎమ్మార్వో వలిగొండ ఆంజనేయులు, ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్, మండల పార్టీ అధ్యక్షుడు కుప్పల జైపాల్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నల్లపాటి శ్రీనివాసరావు, కోదాడ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాసర్ల కోటయ్య, ఉప్పుల యుగంధర్ రెడ్డి, ఎలక నరేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొలిశెట్టి బుచ్చి పాపయ్య, ఉప్పుల జానకి రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు కొమ్ము ఈధరావు, శెట్టి గిరి, రవి, వివిధ గ్రామ శాఖల అధ్యక్షులు మాజీ ఎంపిటిసిలు మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.