calender_icon.png 5 October, 2024 | 8:44 AM

వివరాలు సేకరించాం... ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాం

04-09-2024 05:34:40 PM

వరద కుటుంబాలకు అండగా ఉందాం 

బాధితులకు తోడుగా నిలబడదాం

ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా విరాళాలు అందజేయండి

వరద ప్రభావిత ప్రాంతాల్లో పునర్వాస కేంద్రాలు ఏర్పాటు చేశాం 

కోదాడ నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి

కోదాడ,(విజయక్రాంతి): పాలేరు వాగు పరిసర ప్రాంతాలలో ఉన్న గ్రామాలో వరద నీరు ఇంట్లో చేరి సామాగ్రిలు, వస్తువులు, దుస్తువులు, కొట్టుకుపోయి తినడానికి తిండి లేక అల్లాడుతున్న ముంపు ప్రాంతాల్లో కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి మూడు రోజులు పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరు సమావేశంలో మాట్లాడుతూ వరద బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని అన్నారు. బాధితులకు తోడుగా నిలబడదామని నియోజవర్గ ప్రజలను కోరారు. కష్టాల్లో ఉన్న వరద బాధితులకు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా విరాళాలు అందజేయాలని కోదాడ ప్రజలను కోరారు.

వరద ప్రభావిత కుటుంబాల కొరకు ముంపు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలలో బాధితులు ఉండట కొరకు పునర్వాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, అక్కడ స్వచ్ఛందంగా ఉండవచ్చు అని తెలిపారు. వైద్య బృందం ముంపు ప్రాంతాల్లో ఏ సహాయం గాని,ఆపద వచ్చిన సహాయం చేయుటకొరకు ఉంటారని తెలిపారు. వరదలో కొట్టుకుపోయిన ఇండ్లు, కాలువలు,చెరువులు, రోడ్ల వివరాలు అధికారుల ద్వారా సేకరించామని, తద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపించి మరమ్మత్తులు చేస్తామని తెలిపారు. వరద కుటుంబాలకు విరాళాలు అందజేసే వారు కోదాడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో అందజేయొచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల, చైర్మన్ కందుల కోటేశ్వరరావు ,పట్టణ అధ్యక్షుడు వంగవీటి రామారావు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.