calender_icon.png 4 April, 2025 | 1:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫూలే, అంబేద్కర్ జాతర పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

01-04-2025 02:29:55 AM

మహబూబ్ నగర్ మార్చి 31 (విజయ క్రాంతి) : ఏప్రిల్ 27 న మహబూబ్ నగర్ పట్టణం లోని ఎంబిసి మైదానంలో నిర్వహించనున్న పూలే - అంబేద్కర్ జాతర పోస్టర్ ను  మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సోమవారం ఆవిష్కరించారు.  మహబూబ్ నగర్ పట్టణం లోని అంబేద్కర్ కళాభవన్ లో  పూలే - అంబేద్కర్ జాతర పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పూలె- అంబేద్కర్ జాతర పోస్టర్ ను ఆవిష్కరించారు.  అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పూలే - అంబేద్కర్ జాతర విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు.  ఈ కార్యక్రమంలో బోయపల్లి నర్సింహులు, వేంకట స్వామి, సామెల్, సిరసనోళ్ళ బాలరాజు, గువ్వ లక్ష్మణ్, యాదగిరి నాయక్, జంగయ్య, మాసయ్య, ఆది విష్ణు, విద్యావతి, బాబమ్మ, నర్సింహులు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.