28-03-2025 12:28:00 AM
పటాన్‌చెరు, మార్చి 27 : ఉగాది పర్వదినం పురస్కరించుకొని పటాన్ చెరు డివిజన్ పరిధిలోని చైతన్య నగర్ హనుమాన్ దేవాలయంలో నిర్వహించే పంచాంగ శ్రవణం ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గురువారం సాయంత్రం ఆవిష్కరించారు.
ప్రతి ఏటా ఉగాది పండగను పురస్కరించుకొని చైతన్య నగర్ హనుమాన్ దేవాలయంలో పంచాంగ శ్రవణం నిర్వహించడం ఆనవాయితిగా వస్తుందని తెలిపారు. డివిజన్ పరిధిలోని ప్రజలందరూ పెద్ద ఎత్తున కార్యక్రమానికి హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు రామచంద్రా రెడ్డి, చంద్ర శేఖర్, శ్రీ రాము లు, శీనయ్య, మల్లేష్ యాదవ్, శంకర్, అశోక్, వెంకటేష్, రాజు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.