బెల్లంపల్లి (విజయక్రాంతి): తిలక్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పండుగ పోస్టర్లను బుధవారం ఎమ్మెల్యే గడ్డం వినోద్(MLA Gaddam Vinod) ఆవిష్కరించారు. బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ క్రీడా మైదానంలో శివరాత్రి పండుగను అత్యంత వైభవంగా జరుపుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. తిలక్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. ఉదయం హోమం, సాయంత్రం శివపార్వతుల కళ్యాణంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి, తిలక్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కంటేవాడ నగేష్, కార్యదర్శి గెల్లీ జయరాం యాదవ్, రత్నం రాజంలు పాల్గొన్నారు.