10-04-2025 01:50:55 AM
చేగుంట, ఏప్రిల్ 9ః తెలంగాణ చరిత్రలో భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వీరనారి చాకలి ఐలమ్మ చరిత్రలో నిలిచి పోయారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కొనియాడారు.చేగుంట మండలంలోని రుక్మాపూర్ లో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిజాం నవాబుకు, ఆయన తొత్తులైన భూస్వాములకూ వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరా టంలో తన ఇల్లునే కార్యాలయంగా మార్చిందన్నారు. ఐలమ్మను ’తెలంగాణ తల్లి’గా గుర్తించి 2021 సెప్టెంబర్ 26 నుండి ఆమె జయంతి ఉత్సవాలను నిర్వహిస్తోందని ఆయన తెలిపారు.