మహిళా చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ
ఘనంగా చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి
ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి
వనపర్తి, (విజయక్రాంతి): చాకలి ఐలమ్మ ధైర్యం, తెగువ చూపుతూ ఆనాటి దేశ్ ముఖులు, రజాకార్ల గుండెల్లో భయం పుట్టించిందని, మహిళలకు స్ఫూర్తి ప్రదాత చాకలి ఐలమ్మ అని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ఒకవైపు సాయుధ పోరాటం చేస్తూనే, మరోవైపు అమ్మ లాగా ఉద్యమకారులకు అన్నం పెట్టి ఆదరించిన మహనీయురాలని పేర్కొన్నారు. మంగళవారం చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా వనపర్తి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక శాసన సభ్యులు తుడి మేఘారెడ్డి తో కలిసి పాల్గొన్నారు.
ప్రజల్లో అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడటంలో స్ఫూర్తిని నింపారు. ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి మాట్లాడుతూ... రజాకార్ల కాలంలో రైతుల పట్ల, మహిళల పట్ల జరిగిన దౌర్జన్యాలకు ఎదురొడ్డి కొట్లాడారని, ప్రజల్లో అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడటంలో స్ఫూర్తిని నింపారని కొనియాడారు. అనాడు నిరంకుశ నిజాం రజాకార్లను, దేశ్ ముఖులను ఎదుర్కొన్నదని అన్నారు. నిజాం పాలన, విస్నూరు దేశ్ ముఖ్ కి వ్యతిరేకంగా పోరాడిన యోధురాలు ఐలమ్మ అని అన్నారు.
సంఘ నాయకులు, అధికారులతో కలిసి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళుల్పించారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, అదనపు కలక్టర్ రెవెన్యూ యం. నగేష్, బి.సి. సంక్షేమ శాఖ అధికారి బి సుబ్బా రెడ్డి, సంఘం నాయకులు పాలకొండ సత్యనారాయణ, టి. ఆంజనేయులు, జి.జే .శ్రీనివాసులు, శ్రీనివాసులు, డి. చంద్ర శేఖర్, గంధం నాగరాజు, ఆంజనేయులు, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.