calender_icon.png 1 May, 2025 | 12:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదర్శంగా ఈర్లదిన్నె గ్రామం

26-04-2025 02:49:35 PM

ఎమ్మెల్యే దత్తత గ్రామంలో అభివృద్ధి పరిశీలన

పెబ్బేరు,(విజయక్రాంతి): మండల పరిధిలోని ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి దత్తత గ్రామమైన ఈర్లదిన్నె గ్రామాన్ని శనివారం ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు సందర్శించారు. ఎమ్మెల్యే ప్రతిష్టాత్మకంగా దత్తత తీసుకున్న ఈర్లదిన్నె గ్రామానికి 72 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా, ఇప్పటికే 25 ఇళ్లు పురోగతి సాధించాయి. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ప్రమోదిని రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అక్కి శ్రీనివాస్ గౌడ్ బృందం ఇండ్లను పరిశీలించారు. అన్ని ఇండ్లను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే బేస్మేట్ లేవల్ లో పూర్తి అయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్ సాగర్, సీనియర్ నాయకులు సురేందర్ గౌడ్, మోతే రాములు,రామన్ గౌడ్, నరసింహనాయుడు, యుగంధర్ రెడ్డి, రాజేష్, రణధీర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, అన్వర్ తదితరులు పాల్గొన్నారు