కామారెడ్డి: జుక్కల్ నియోజకవర్గంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్ని అంటాయి. జుక్కల్ మండలంలోని కౌలాస్ కోటపై ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిజాంసాగర్ నవోదయ పాఠశాలలో జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీ కాంతారావు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో జెండాను ఎగరవేశారు. నిజాంసాగర్ నవోదయ పాఠశాలలో విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రిన్సిపల్ సత్యవతి ఎమ్మెల్యే దంపతులకు జ్ఞాపికను అందజేశారు. బిచ్కుంద మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే జెండా ఎగర వేశారు. నిజాంసాగర్ మండల కేంద్రంలో తహసిల్దార్ బిక్షపతి నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఈ ఏ సోలోమన్ ఎస్సై సుధాకర్ ఎంపీడీవో గంగాధర్ ఏవో అమర్ ప్రసాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ జండా ఎగరవేశారు. మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో తహసిల్దార్ జెండాను ఎగురవేశారు.