calender_icon.png 25 January, 2025 | 4:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

24-01-2025 08:53:35 PM

బిచ్కుంద (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని శుక్రవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసుపత్రిలోని కోల్డ్ స్టోరేజ్, డయాలసిస్ సెంటర్, ఆక్సిజన్ సరఫరా వంటి గదులకు వెళ్లి పరిశీలించారు. ఆసుపత్రిలో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుతో పాటు కాంగ్రెస్ నాయకులు మున్నూరు నాగనాథ్, వెంకట్ రెడ్డి, మైనారిటీ నాయకులు ఖలీల్, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.