calender_icon.png 31 January, 2025 | 3:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోయా రైతులు ఆందోళన చెందవద్దు

30-01-2025 05:42:55 PM

కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి భరోసా

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

జుక్కల్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో కొనుగోలు కేంద్రం మూత పడటంతో మద్నూర్, డోంగ్లీ మండలాలకు చెందిన సోయా రైతులు తాము పండించిన సోయాబీన్ పంట దాదాపు 8 వేల క్వింటాళ్ల దాకా మిగిలిపోయింది. అయితే ఇప్పటికే ఈ విషయం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు(Jukkal MLA Thota Lakshmi Kanta Rao)  తెలంగాణ మార్క్ ఫెడ్ చైర్మన్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.

అక్కడితో ఆగకుండా  గురువారం ఢిల్లీకి వెళ్లి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి, వ్యవసాయ శాఖ కార్యదర్శి దేవేష్ చతుర్వేదిలను కలిసి వినతి పత్రం అందజే సారు. కొనుగోలు చేయకుండా మిగిలిపోయిన సోయా పంటను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేయగా వారు సానుకూలంగా స్పందించి ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కాబట్టి రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, చివరి ధాన్యపు గింజ వరకు కొనుగోలు చేసేంత వరకు తాను విశ్రమించబోనని చెప్పారు. ఎమ్మెల్యే వెంట మద్నూర్ సోసైటీ చైర్మెన్ శ్రీనివాస్ పటేల్, డోంగ్లీ మండల అధ్యక్షులు రాజు పటేల్ ఉన్నారు.