calender_icon.png 16 March, 2025 | 5:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీసీ రోడ్డు పనులు నాణ్యతతో చేపట్టాలి

16-03-2025 02:26:10 PM

రూ.50 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

మద్నూర్,(విజయక్రాంతి): సీసీ రోడ్డు నిర్మాణం పనులు నాణ్యతతో చేపట్టాలని జుక్కల్ ఎమ్మెల్యే  తోట లక్ష్మీకాంతారావు(Jukkal MLA Thota Lakshmi Kanta Rao) అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా మద్నూర్ లో రూ.50 లక్షలతో సిసి రోడ్డు పనులు ఎన్ ఆర్ ఈజీఎస్ కింద చేపడుతున్నట్లు తెలిపారు. మద్నూర్ మండల కేంద్రంలో ప్రజల ఇబ్బందులను చూసి రోడ్లు బాగుండాలని ఉద్దేశంతో సిసి రోడ్డు మంజూరు చేసినట్లు తెలిపారు.

నాణ్యతతో పనులు చేపట్టాలని సంబంధిత కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధారా సాయిలు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేశ్వర్, విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు హనుమంతు యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు హనుమాన్లు, స్వామి, హనుమంతరావు దేశాయి, ప్రజ్ఞా కుమార్, మిలాన్, తుకారాం, కొండ గంగాధర్, గోపి, బాలు యాదవ్, హనుమాన్లు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.