29-03-2025 12:48:15 AM
బస్ సర్వీస్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు
భద్రాచలం,(విజయక్రాంతి): మారుమూల గిరిజన గ్రామాలైన తునికి చెరువు, ఆర్లగూడెం, మహాదేవపురం లక్ష్మీనగరం గ్రామాల మీదుగా వెళ్లే బస్సు సర్వీసును భద్రాచలం శాసనసభ్యులు తెల్ల వెంకటరావు శుక్రవారం ఉదయం ప్రారంభించారు. రోజుకు రెండు సార్లు తిరిగే ఈ బస్సు భద్రాచలం నుండి ఉదయం 6 గంటలకు సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు బయలుదేరుతుంది. భద్రాచలం నుండి బయలుదేరిన ఈ సర్వీసు గిరిజన గ్రామాలైన పాలిటెక్నిక్ కాలేజీ తునికిచెరువు ,చీపురుపల్లి, మాదాయగూడెం, ఆర్లగూడెం, మహాదేవపురం మీదుగా దుమ్ముగూడెం మండల కేంద్రమైన లక్ష్మి నగరం కేంద్రానికి చేరుకొని తిరిగి అరగంట తర్వాత మరల అదే గ్రామాల మీదుగా భద్రాచలం చేరుతుందన్నారు. ఇంతవరకు ఈ గ్రామాలు ప్రజలు పూర్తిగా ఆటోల మీదే ప్రయాణిస్తుండగా ఈ బస్సు ఏర్పాటు చేయడం వల్ల గిరిజనులు అతి తక్కువ ఛార్జీతో వారి గమ్యస్థానాలకు వెళ్లే అవకాశం ఏర్పడింది.
ప్రారంభ కార్యక్రమంలో భద్రాచలం డిపో మేనేజర్ బి తిరుపతి అసిస్టెంట్ మేనేజర్ గౌతమి గ్యారేజ్ సిబ్బంది సురేష్ స్టేషన్ మేనేజర్ వెంకన్న తో పాటు కాంగ్రెస్ నాయకులు భోగాల శ్రీనివాసరెడ్డి బి వెంకటరెడ్డి రత్నం రమాకాంత్ నాయుడు, చిట్టిబాబు లకావత్ వెంకటేశ్వరరావు ఎండి నవాబ్ తదితరులు పాల్గొన్నారు.