10-02-2025 07:59:49 PM
భద్రాచలం (విజయక్రాంతి): పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే వెంకటరావు అన్నారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని బ్రిడ్జి రోడ్డునందు నూతనంగా ఏర్పాటు చేసిన సింధు చెవి ముక్కు, గొంతు, స్కిన్, జనరల్ హాస్పిటల్ ప్రారంభోత్సవ వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేశారు. అనంతరం డాక్టర్స్ ఒపి కన్సల్టేషన్ రూం లను ప్రముఖ చిన్న పిల్లల వైద్యులు డాక్టర్ పి.రాజశేఖర్, డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, జనరల్ వార్డ్ లను డాక్టర్ అక్కినేని లోకేష్, ఫార్మసీ ను బి.ది కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ జిల్లా సెక్రెటరీ పరిమి సోమశేఖర్ లు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
అనంతరం ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ మహమూద్ పాషా అవసరమైన వారికి ఎండోస్కోపీ పరీక్ష ఉచితంగా చేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ నిర్వాహకులు ENT సర్జన్ డాక్టర్ మహమ్మద్ పాషా, డాక్టర్ ఉదయ్, ప్రముఖ డాక్టర్ సురేష్ కుమార్, కంటి వైద్యులు డాక్టర్ నారాయణ, సభ్యులు మురళి హాస్పిటల్ నిర్వాహకులు కొప్పుల మురళి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.