భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం పట్టణ పరిధిలోని ఇండస్ట్రీ ఏరియా, కొత్త కాలనీ, శాంతినగర్, గ్రంధాలయం, జగదీష్ కాలనీలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు బుధవారం భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ప్రారంభోత్సవం చేశారు. భద్రాచలం గ్రామపంచాయతీ జనరల్ ఫండ్ నుండి విడుదలైన నిధులతో నిర్మాణం చేపట్టిన రోడ్లను ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఈవో శ్రీనివాసరావు, పి.ఆర్.ఏ.ఈ శ్రీరామ్, భద్రాచలం మండలం నాయకులు భోగాల శ్రీనివాస రెడ్డి, భీమవరం వెంకటరెడ్డి, ఎండి నవాబ్, రాము, పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.