17-04-2025 12:56:42 AM
వెల్దుర్తి, ఏప్రిల్ 16 :వెల్దుర్తి మండలంలోని వివిధ గ్రామాల్లో బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ రైతులందరూ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలని తెలిపారు. దళారులకు అమ్ముకొని నష్టపోకుండా ధాన్యం కొనుగోలు కేంద్రా ల్లోనే ధాన్యాన్ని తూకం వేసి ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సందర్శించి అన్ని వసతులను ఏర్పాటు చేయాలని ఆమె ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండల మాజీ జెడ్పిటిసి రమేష్ గౌడ్, ఫ్యాక్స్ చైర్మన్ అనంత రెడ్డి, వెల్దుర్తి మాజీ సర్పంచ్ వెన్నవరం మోహన్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోదండ కృష్ణ గౌడ్, వెన్నవరం శ్రీనివాస్ రెడ్డి, రమేష్ చందర్, గ్యాస్ శ్రీనివాస్ రెడ్డి, జగ్గా అశోక్ గౌడ్, చల్ల మహేష్, చందు కిష్టయ్య, పాల్గొన్నారు.