11-04-2025 08:16:24 PM
ఎమ్మెల్యే సునీతా లక్ష్మ రెడ్డి
కొల్చారం,(విజయక్రాంతి): కొనుగులు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలని, అధికారులు వెంటనే కొనుగోలు కేంద్రాలకు రైస్ మిల్స్ లను అలట్మెంట్ చేయాలని నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి(MLA Vakiti Sunitha Lakshma Reddy) అన్నారు. శుక్రవారం మండల పరిధిలో పలు గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని అన్నారు కొనుగోలు కేంద్రాలకు గన్ని బ్యాగుల కొరత లేకుండా చూడాలన్నారు ధాన్యం తరలింపు కోసం ట్రాన్సుపోర్టు సౌకర్యం కల్పించి, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జామా చేయాలని అన్నారు. రంగంపేట, సంగయిపేట, వెంకటాపూర్, వసూరం తండా, అంసాన్ పల్లి, జలాల్ పూర్, కొంగోడు, వరిగుంతం గ్రామాల్లో వరి కొనుగొలు కేంద్రాలను ప్రారంభించారు