06-02-2025 03:03:00 PM
ప్యారానగర్ లో నిర్మిస్తున్న జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డు పనులను వెంటేనే నిలిపివేయాలి
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
సంగారెడ్డి,(విజయక్రాంతి): పటాన్ చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం ప్యారానగర్ లో నూతనంగా నిర్మిస్తున్న జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డు పనులను వెంటేనే ప్రభుత్వం నిలిపివేలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి(Narsapur MLA Sunitha Lakshma Reddy) డిమాండ్ చేశారు. గురువారం సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గుమ్మడిదల మండలం ప్యారానగర్ సర్వే నెంబర్ 40, 41లో నూతనంగా నిర్మిస్తున్న జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డు పచ్చని పంట పొలాలు, అటవీ ప్రాంతంలో పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. దీనిని అక్కడ నివసించే చుట్టూ పక్కల గ్రామ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
గుమ్మడిదల మండలంలో అటవీ ప్రాంతం ఎక్కువగా విస్తరించింది. ఇక్కడ వ్యవసాయాన్ని నమ్ముకొని జీవించే రైతు కుటుంబాలు ఎక్కువగా ఉన్నయి. పచ్చటి పొలాల మధ్య డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం వలన అక్కడి ప్రజలు ఇబ్బంది పడుతారు. డంపింగ్ యార్డ్ నుంచి వెలువడే దుర్వాసన కాలుష్యం కారణంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆందోళన చెందుతున్నారు. భూగర్భ జలాలు కలుషితమై వ్యవసాయ భూములు పనికిరాకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు భూముల ధరలు కూడా తగ్గిపోతాయని చెప్తున్నారు అందుకే అధికారులు ఇప్పటికైనా ఆలోచించి డంపింగ్ యార్డు పనులను ఆపాలని కోరుతన్నము.
ప్యారానగర్ పరిసర ప్రాంతం సర్వే నెంబర్ 40, 41లో 750 ఎకరాల భూమిలోని 150 ఎకరాల మిగుల భూమిలో జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డు కేటియించడం జరిగింది. కానీ అక్కడ రైతులు ఆ భూమి వారిది అని,పంట సాగు చేస్తున్నామని వారి భూమి సర్వే చేసి సరిహద్దులు చూపాలని కోర్టు కు వెళ్ళి రిట్ పిటిషన్ నెంబర్ 35187/2024 ఢాకలు చేయడం జరిగింది. స్టే ఆర్డర్(Status Quo) ఉన్నాక డంపింగ్ యార్డు పనులు ప్రారంభించడం కోర్టు ధిక్కారం అవుతుంది. కనుక పనులు వెంటనే నిలిపివేయాలని కొరుతున్నాము. అలాగే నర్సాపూర్ సమీపం లో ఉండే అర్బన్ పార్కు పక్కనే ఉన్న రాయరావ్ చెరువు, పంట పొలాలు కూడా కలుషితం అవడం జరుగుతుంది అని అక్కడి ప్రజలు అంటున్నారు ఇప్పటికే హైదరాబాద్ సమీపం లో జవహర్ నగర్ లో డంపింగ్ యార్డు తో అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకోవడం జరుగుతుంది.
సుమారు పది కిలో మీటర్ వరకు బుగర్భా జలాలు కలుషితం అవడం తో అక్కడ చుట్టు పక్కల నివసించే 50 వేల కుటుంబాలకు రోజు నరకం అనుభవిస్తున్నారు. తాగే నీళ్లు, పీల్చే గాలి, చుట్టూ వాతావరణం అంతా కలుషితం అయినది. కావున హైదరాబాద్ లో సేకరించిన చెత్త మొత్తం ప్యారానగర్ కు తరలించి పచ్చని పొలాల మధ్య డింపింగ్ యార్డు పనులు ప్రారంభించడం బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ప్రజా అభిప్రాయనికి వ్యతిరేకంగా కోర్టు స్టే ఆర్డర్(Status Que) ఉన్నందున డంపింగ్ యార్డు నిర్మాణ పనులు వెంటేనే నిలిపివేయాలసిందిగా బిఆర్ఎస్ పార్టీ తరుపున కోరుతున్నామని తెలిపారు. ఈ సమావేశంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, బీఆర్ఎస్ నాయకులు బుచ్చిరెడ్డి, దేవేందర్ రెడ్డి, ఆదర్శ రెడ్డి, బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.