14-02-2025 02:06:16 AM
పెబ్బేరు, పిబ్రవరి 13: పెబ్బేరు మండలంలోని వివిధ గ్రామాలలో గురువారం ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి సుడిగాలి పర్యటన చేపట్టారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద రూ. కోటి 30లక్షల నిధులు మంజూరైన సందర్బంగా మండలంలోని కంచిరావు పల్లి, కొత్త సుగూర్, సుగూర్, బునాదీపురం, రంగాపూర్, జనంపల్లి, పెంచికలపాడు, ఈర్లదిన్నె, బూడిదపాడ్, తిప్పాయిపల్లి, గుమ్మడం, యాపర్ల, అయ్యవారిపల్లి, పాతపల్లి గ్రామాలలో సీసీ రోడ్లు, బిటి రోడ్లు, డ్రైనేజీ, అంగన్వాడీ, గ్రామపంచాయతీ భవన నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసి పనులను ప్రారంభించారు.
ముఖ్యమంత్రి సహాయనిధి, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను ఆయా గ్రామాలలోని లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమాలలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ప్రమోదిని, వైస్ చైర్మన్ విజయవర్ధన్ రెడ్డి, ఎంపిడిఓ రవీందర్, ఎమ్మార్వో లక్ష్మీ, జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అక్కి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రంగాపురం రాంచంద్రా రెడ్డి, దయాకర్ రెడ్డి, సురేందర్ గౌడ్, వెంకటేష్ సాగర్, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.