23-03-2025 12:00:00 AM
గిరిజన ఆదివాసీ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్
ఎల్బీనగర్, మార్చి 22 : సుధీర్ రెడ్డి రాజకీయంగా పనికిరాడు అని, అసలు ఎమ్మెల్యే పదవికి అనర్హుడు అని గిరిజన ఆదివాసి కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ అన్నారు. హస్తినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్ ను ఆమె నివాసంలో శనివారం కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ఆయన పరామర్శించారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై మీడియా సమావేశం నిర్వహించారు.
అనంతరం బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ.. ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ఉం డి మహిళలను అగౌరపరిచే విధంగా మాట్లాడడం సుధీర్ రెడ్డికి సరికాదన్నారు. సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి అనర్హుడ అని మండిపడ్డారు. తను చేసిన వ్యాఖ్యలకు నైతికంగా బాధ్యత వహించి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
చట్టపరంగా అతడిపై చర్యలు తప్పవని, కఠినశిక్ష పడే వరకు మేము పోరా డుతూనే ఉంటామన్నారు. త్వరలోనే నేషనల్ ఎస్టీ కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. సుధీర్ రెడ్డికి కులపిచ్చి ఉందని, స్త్రీలు అంటే గౌరవం లేదన్నారు.
తోటి ప్రజాప్రతినిధులను గౌరవించని, వ్యక్తి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సుజాత నాయక్, టీపీసీసీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ గౌని నర్సింహ గౌడ్, కాంగ్రెస్ చంపా పేట డివిజన్ అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి, మహిళా నాయకురాలు లత, అనసూయ, దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.