calender_icon.png 5 April, 2025 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని అరెస్టు చేయాలి

04-04-2025 09:56:18 AM

- కార్పొరేటర్ సుజాత నాయక్ కు క్షమాపణ చెప్పాలి

- కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంటే.. 

దొంగ చాటున కొబ్బరికాయలు కొట్టడం సిగ్గుచేటు

- టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ 

- ఈ నెల 7న ఎల్బీనగర్ నియోజకవర్గంలో

 అభివృద్ధి పనులకు మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

ఎల్బీనగర్: హస్తినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్ పై ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి(LB Nagar MLA Sudheer Reddy) చేసిన వ్యాఖ్యలు సహించరానివని..  సుధీర్ రెడ్డికి నీతి, నిజాయితీ ఉంటే బహిరంగ క్షమాపణలు చెప్పాలని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్(Former MP Madhu Yashki Goud) డిమాండ్ చేశారు. వనస్థలిపురంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మధుయాష్కీగౌడ్ మాట్లాడుతూ.. మహిళలను గౌరవించాల్సిన సంస్కారం, సభ్యత ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి లేదన్నారు. గిరిజన మహిళా కార్పొరేటర్ వ్యక్తిత్వాన్ని అవమానిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసి, ఇప్పటి వరకు క్షమాపణ చెప్పకపోవడం దుర్మార్గమన్నారు.

ఎమ్మెల్యేపై పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైందని, న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం చేస్తామని, పోలీసులు ఆయనను వెంటనే  అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో ఇవ్వని నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 15 నెలల్లో ఇచ్చామని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే తట్టుకోలేక, దొంగ చాటున గల్లీ లీడర్లు, రౌడీ షీటర్లను వెంట వేసుకొని వెళ్లి కొబ్బరికాయలు కొడుతూ శంకుస్థాపనలతో డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జిగా అభివృద్ధి పనులకు తాను సహకరిస్తున్నానని, రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేపట్టాలన్నదే తన ఉద్దేశమన్నారు. 

7న ఎల్బీనగర్ నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన 

ఎల్బీనగర్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు,  ప్రారంభోత్సవానికి జిల్లా ఇన్ చార్జి మంత్రి  శ్రీధర్ బాబు హాజరవుతున్నారని తెలిపారు. ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే కూడా వచ్చి కొబ్బరికాయ కొట్టవచ్చన్నారు. కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లు నెత్తిన చల్లుకొని సుజాత నాయక్ ని క్షమాపణ కోరాలని హితవు పలికారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు రాగుల వెంకటేశ్వర రెడ్డి, బానోతు సుజాత నాయక్, పీసీసీ సెక్రెటరీ గజ్జి భాస్కర్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు కుట్ల నర్సింహా యాదవ్, చెన్నగోని రవీందర్ గౌడ్, శ్రీపాల్ రెడ్డి , శశిధర్ రెడ్డి , మంజులారెడ్డి, వేణుగోపాల్ యాదవ్ , మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాశం అశోక్ గౌడ్, బుడ్డా సత్యనారాయణ, నేలపాటి రామారావు , గణేశ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.