calender_icon.png 23 March, 2025 | 2:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని అరెస్టు చేయాలి

22-03-2025 06:32:48 PM

స్పీకర్ గడ్డం ప్రసాద్ కు ఫిర్యాదు చేసిన గిరిజన సంక్షేమ సంఘం నాయకులు

ఎల్బీనగర్: గిరిజన మహిళ, కార్పొరేటర్ సుజాత నాయక్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన సందర్భంగా వెంటనే అరెస్టు చేయాలని గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శనివారం శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం డీజీపీకి సైతం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ... ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన తర్వాత ఎందుకు అరెస్ట్ చేయడం లేదన్నారు. ఈ విషయంలో పలు అనుమానాలు  ఉన్నాయని ఆరోపించారు.

గిరిజన మహిళా కార్పొరేటర్ పై గౌడ సామాజిక వర్గానికి చెందిన మధుయాష్కి గౌడ్ తో హనీమూన్ నడుస్తుంది అని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ ఎందుకు అరెస్టు చేయలేదన్నారు. సామాన్య ప్రజలకు ఒక న్యాయం...? ఎమ్మెల్యేకు ఒక న్యాయమా...?? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొర్ర లక్ పతి నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ బాబురామ్ నాయక్ వైస్ ప్రెసిడెంట్, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ మెంబర్ గణేశ్ నాయక్, నాయకులు రాజు రాథోడ్, లక్ష్మణ్ మహారాజ్ తదితరులు పాల్గొన్నారు.