calender_icon.png 20 April, 2025 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కబ్జాదారుడు

19-04-2025 10:54:57 PM

 - అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా..?

- శివారు కాలనీల్లో అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు

- రాచకాల్వ ఆక్రమణలపై ఎమ్మెల్యేగా ఏమి చేశారు?

- ఎమ్మెల్యేపై బీజేపీ కార్పొరేటర్ల విమర్శలు, ఆరోపణలు..

ఎల్బీనగర్: ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అతి పెద్ద కబ్జాదారుడు, అవినీతిపరుడు, మోసకారుడు అని బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు ధ్వజమెత్తారు. రాచకాలువపై ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు జరిగింది.. బీఆర్ఎస్ హయాంలోనేనని, అప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్ రెడ్డి ఏం చేస్తున్నాడని బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాసరెడ్డి, బీఎన్ రెడ్డి నగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి ప్రశ్నించారు. శనివారం సచివాలయ నగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎమ్మెల్యే వ్యక్తిగత విమర్శలకు దిగుతూ తన స్థాయిని మరింత దిగదార్చుకుంటున్నాడని విమర్శించారు. శివారు కాలనీలకు డ్రైనేజీ సౌకర్యం కల్పించడానికి తాము విశ్వ ప్రయత్నం చేస్తున్నామని, అందులో భాగంగా హయత్ నగర్ వరకు ఔట్ లెట్ నిర్మాణానికి కృషి చేశామన్నారు.

తనకు క్రెడిట్ దక్కదన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే, ఆయన అనుచరులు రాచ కాలువ డ్రామాను తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు. రాచకాలువపై అక్రమ నిర్మాణాల కూల్చివేతలను ఎమ్మెల్యే దగ్గరుండి చేయించాలని సవాల్ చేశారు. 118 జీవోతో ప్రజలకు ఒరిగిందేముందని ప్రశ్నించారు. బాధితులందరికీ రిజిస్ట్రేషన్ చేస్తామని 118  జీవోను తెచ్చి, దాన్ని పనికిరాని జీవో గా మార్చారని విమర్శించారు. గ్రేటర్ లోనే నెంబర్ వన్ కబ్జా కోర్ సుధీర్ రెడ్డి అని, బీజేపీ రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి విమర్శించారు.‌ ఎల్బీనగర్ నియోజకవర్గంలోని 11 డివిజన్లలో సుధీర్ రెడ్డి కబ్జాలు కనిపిస్తాయన్నారు. కబ్జాలను ప్రోత్సహించి అక్రమంగా డబ్బు సంపాదించడం సుధీర్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు.  

- రౌడీలు లేకుండా తిరుగలేని దుస్థితిలో ఎమ్మెల్యే...

 - కార్పొరేటర్లు మధుసూదన్ రెడ్డి, నర్సింహరెడ్డి 

తన వెంట రౌడీలు, గంజాయి మత్తు బానిసలు లేకుండా సుధీర్ రెడ్డి నియోజకవర్గంలో తిరుగలేని పరిస్థితిలో ఉన్నాడని చంపాపేట కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి, మనసురాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ లో ఉన్నన్ని రోజులు కార్పొరేటర్ల హక్కులను కాలరాసి, అభివృద్ధికి నిధులు తేకుండా కాలంగడిపాడని విమర్శించారు. నియోజకవర్గానికి రూ.8 కోట్లువస్తే కేవలం రూ. 50 లక్షలు ఖర్చుచేసి మిగతా నిధులు ప్రభుత్వానికి వెళ్లిపోయేలా చేశాడని విమర్శించారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తన స్వార్థం కోసం ఇతర పార్టీల కార్పొరేటర్లతో పాటు తన పార్టీ నాయకులను కూడా అణిచివేస్తాడని విమర్శించారు. 

ఎల్బీనగర్ ప్రజలు సుధీర్ రెడ్డిని మలక్ పేటకు సాగనంపుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎల్బీనగర్ నియోజకవర్గ బీజేపీ కార్పొరేటర్లు కళ్లెం నవజీవన్ రెడ్డి, బద్దం ప్రేమ మహేశ్వర్ రెడ్డి, నాయికోటి పవన్ కుమార్, కాలనీ సంక్షేమ సంఘాల అధ్యక్షులు దామోదర్ రెడ్డి, చిత్రాంజన్, శశికాంత్, యాదిరెడ్డి, జగన్మోహన్ చారి, దేవేందర్, అశోక్ రెడ్డి, సైదులు,శర్మ,పార్టీ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రావు, సీనియర్ నాయకులు రఘురాం నేత, శంకరయ్య గౌడ్, గంగం ప్రేమ నాథ్, శరత్ కుమార్, శివ శంకర్ గౌడ్, మహేందర్ రెడ్డి,సుధీర్, పవన్ రెడ్డి, రాజేంద్రప్రసాద్, రమేష్,ఫణి, కిషోర్,మురళి, విజయ్, రాజు,సురేష్ కుమార్, గౌరీ శంకర్, ప్రేమ్, శ్రీధర్ రెడ్డి, ప్రేమ్ తదితరులు ఉన్నారు.