calender_icon.png 19 March, 2025 | 8:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

118 జీవోపై స్పీకర్ కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి..

18-03-2025 11:15:06 PM

ఎల్బీనగర్: అసెంబ్లీ సమావేశాల్లో 118 జీవోపై స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెచ్చారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ... ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో సుమారు 44 కాలనీల్లో పేద, మధ్య తరగతి వారు రిజిస్ట్రేషన్ చేసుకుని ఇండ్లు కట్టుకుని నివాసముంటున్నారని తెలిపారు. వారికి 2007 నుంచి ఇండ్లు, ప్లాట్లకు రిజిస్ట్రేషన్ నిలిపివేశారని, వారి ఇబ్బందులు గ్రహించి బీఆర్ఎస్ ప్రభుత్వం 118 జీవో విడుదల చేసినట్లు చెప్పారు. 118 జీవోతో 75 శాతం వరకు కాలనీవాసులు లబ్ధి పొందారని, ఇంకా 25 శాతం ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదు చేశారు. కాగా, డిసెంబర్ 2023 నుంచి జీవో అమలును నిలిపివేసినట్లు వివరించారు. జీవో 118ను పునరుద్ధరించాలని, నిషేధిత జాబితా నుంచి 22ఏ ను తొలగించాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కోరారు. దీనికి స్పందించిన రెవెన్యూశాఖ మంత్రి మాట్లాడుతూ... సుధీర్ రెడ్డి చేసిన ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకొని అధికారులకు తగు ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు.