24-03-2025 03:23:41 PM
ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ఎల్బీనగర్: ఎల్బీనగర్ నియోజకవర్గంలో అసంపూర్తిగా మిగిలిన డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులను పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆదేశించారు. చంపాపేట డివిజన్ పరిధిలోని శుభోదయ కాలనీలో సోమవారం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, వాటర్ వర్క్స్ అధికారులు పర్యటించారు. ఈ సందర్భంగా బస్తీవాసులు పలు సమస్యలను వివరించారు. కాలనీలో రోడ్ల నిర్మాణం కోసం తవ్వకాలు చేపట్టి, పనులు పూర్తి చేయలేదన్నారు. డ్రైనేజీ పనులు పూర్తి చేసి, రోడ్డు పనులు చేపట్టాలని కోరారు. అనవసరంగా ముందే రోడ్లు అనంతరం సుధీర్ రెడ్డి మాట్లాడుతూ... శుభోదయ కాలనీలో రోడ్లు నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేశారన్నారు. ఇప్పుడు ఉన్న డ్రైనేజీ పైపులైన్ ను ఎనిమిది ఇంచుల స్థానంలో పన్నెండు ఇంచుల పైపులైన్ నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు. కాలనీలో ఎత్తుపల్లాలు సరిగ్గా చూసుకొని డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. త్వరలోనే శుభోదయ కాలనీలో డ్రైనేజీ పనులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో వాటర్ వర్క్స్ అధికారులు రమ్యభారతి, షబ్బీర్, శ్రీహరి, శ్రీనివాస్, పలువురు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.