calender_icon.png 16 March, 2025 | 3:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాచకాల్వపై సర్వే చేయాలి

16-03-2025 12:00:00 AM

ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 

రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సమావేశం

ఎల్బీనగర్, మార్చి 15 : రాచకాల్వపై పూర్తి స్థాయి సర్వే చేయాలని రెవెన్యూ , ఇరిగేషన్ అధికారులను ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆదేశించారు.  శనివారం తన కార్యాలయంలో హయత్ నగర్ తహసీల్దార్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు.  త్వరగా రాచకాల్వ భూమి సర్వే పూర్తి చేయాలని అధికా రులను ఆదేశించగా... వారంలో సర్వే పూర్తి చేస్తామని సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ... రాచకా ల్వకు ప్రాచీన నేపథ్యం ఉన్నదని, నిజాం కాలంలో తుర్కయంజాల్ మసాబ్ చెరువు నుంచి హయత్ నగర్ కుమ్మరి కుంట వరకు రైతుల పొలాలకు నీరు ఇవ్వడానికి నిర్మించారని తెలిపారు. రాచకాల్వ తుర్కయంజాల్, ఇంజాపూర్, సాహెబ్ నగర్ కలాన్, హయత్ నగర్ గ్రామాల మీదుగా ప్రవహిస్తుందన్నారు. రాచకాల్వ సాహెబ్ నగర్ కలాన్, హయత్ నగర్ లోని పలుచోట్ల కబ్జాకు గురవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

రాచ కాల్వను కొన్నిచోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారాలు తమ వెంచర్‌లో కలిపేసినట్లు చెప్పా రు. భవిష్యత్ లో ఎంత పెద్ద వర్షం వచ్చినా రాచకాల్వ పక్కన ఉన్న కాలనీలు ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాహెబ్ నగర్ కలాన్, హయ త్ నగర్ గ్రామాల్లో సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేసి రాచకాల్వను పునరుద్ధరించాలని కోరారు. సమావేశంలో బీఆర్‌ఎస్ బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ అధ్యక్షులు అరవింద్ రెడ్డి, హయత్ నగర్ తహసీల్దార్ జానకి, ఇరిగేషన్ డీఈ శుక్లజ, ఏఈ సతీశ్, సర్వేయర్ జ్యోతి, గాయత్రీ నగర్ ఫేజ్ - 4 కాలనీ అధ్యక్షుడు గౌరీశెట్టి మనోజ్, శ్రీ వెంకటేశ్వర కాలనీ అధ్యక్షుడు కృష్ణ, శ్రీ పాపిరెడ్డి కాలనీ అధ్యక్షుడు తెరేటిపల్లి శ్రీశైలం, గాయత్రీ నగర్ ఫేజ్ -3 అధ్యక్షుడు రాజుగౌడ్, క్రిస్టల్ విల్లాస్ అధ్యక్షుడు సత్యనారాయణ, గాయత్రీనగర్ అధ్యక్షుడు సూర్యానాయక్  తదితరులు పాల్గొన్నారు.