ఇల్లెందు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గం మండల కేంద్రమైన టేకులపల్లి నుంచి బోడు వెళ్ళే మార్గంలో రేగులతండా - దాసుతండ వరకు గత ఏడాది నుంచి నిలిచిన బీటీ రోడ్ విస్తరణ పనులను మంగళవారం ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రారంభించారు. ఈ రహదారి నిర్మాణంతో పాటు డివైడర్ నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని ఎమ్మెల్యే కనకయ్య తెలిపారు. ప్రస్తుతం గుంతలు పూడ్చే పనులు జరుగుతుండగా, అతి త్వరలోనే బీటీ నిర్మాణం చేపట్టనున్నట్లు పీఆర్ఎఈ నవీన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఇస్లావత్ రెడ్యానాయక్, తదితరులు పాల్గొన్నారు.