బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని తాళ్ల గురిజాల గ్రామంలో మంగళవారం రూ.ఐదు లక్షల నిధులతో ఓపెన్ జిమ్ ను ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రారంభించారు. ఇటీవల ప్రజాదర్బార్ లో తమ గ్రామంలో ఓపెన్ జిన్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు ఇచ్చిన వినతి పత్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే వినోద్ ఓపెన్ జిమ్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కారుకూరి రామ్ చందర్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సంగతి సత్యనారాయణ తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.