క్రీడలు మరింత ఉత్సాహాన్ని పెంచుతాయి
ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటూ అభివృద్ధి చేస్తున్నాం- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్, (విజయక్రాంతి): విద్యార్థులు అన్ని సంఘాల్లో రాణించే విధంగా సన్నతం కావాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పాలిటెక్నిక్ కళాశాల క్రీడలను ఆయన ప్రారంభించి మాట్లాడారు క్రీడలు మానసిక వికాసానికి ఎంతో బాధ పడతాయని, క్రీడలకు ఈ ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని, పిల్లల్లో దాగిన క్రీడా నైపుణ్యం వెలికి తీసి ఇష్టమైన క్రీడల్లో శిక్ష ఇప్పించాలని చెప్పారు.
మహబూబ్ నగర్ పాలిటెక్నిక్ కళాశాల లో ఉన్న ఎన్ సిసి యూనిట్ రాష్ట్ర స్థాయి శిక్షణ ఏర్పాటు కోసం నిధులు ఇస్తినని హామీ ఇచ్చారు. ప్రతి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ను కూడా అప్ గ్రేడ్ చేసుకోవడం ఎంతైనా అవసరమని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో రెండు సంవత్సరాల కాలంలో రూ 2 లక్షల 30 వేల కోట్లు పెట్టుబడులు తెచ్చారని గుర్తు చేశారు. యువతకు ఉద్యోగాల కల్పన కల్పించేందుకు ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జి.మోహన్ బాబు, డిటిఓ వి.శ్రీనివాస్ , పిడి ఎ.శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఒక్కరికి కూడా ప్రభుత్వ పథకాలు దూరం కావొద్దు
కొత్తపేట గ్రామ సభలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని, హన్వాడ మండలం లోని కొత్తపేట లో జరిగిన ప్రజాపాలన గ్రామ సభ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాపాలన గ్రామ సభ లో ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులు కోసం ప్రతి ఒక్కరి నుంచి అధికారులు దరఖాస్తులు తీసుకొంటారని చెప్పారు. ఏ ఒక్క పేదవాడు ప్రభుత్వ పథకాలకు దూరం కాకూడదనే ఉద్దేశం తో పలుమార్లు దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు.
గతంలో 180 ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిందని, మళ్ళీ ఒకసారి పేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందించేందుకు , అర్హులైన వారికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా తో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందిస్తామని స్పష్టం చేశారు. ఏకకాలంలో ఏ ప్రభుత్వం కూడా చేయనిది రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజాప్రభుత్వం రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేశామని, మహిళల కోసం ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించామని గుర్తు చేశారు. పేదవారికి ఇందిరమ్మ ప్రభుత్వం అండగా నిలబడుతుందని, ఈ ప్రభుత్వం లో ప్రతి ఒక్కరికి లాభం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డిఆర్డీఎ పిడి నర్సింహులు, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, డిసిసి కార్యదర్శి టంకర కృష్ణయ్య యాదవ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి.మహేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మక్సూద్, నాయకులు బుద్దారం సుధాకర్ రెడ్డి, మల్లయ్య, లింగం నాయక్, రాజేష్, శంకర్ నాయక్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.