calender_icon.png 24 February, 2025 | 8:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెరువులు నింపేందుకు ఎమ్మెల్యే చొరవ చూపాలి..

24-02-2025 06:01:02 PM

అక్షరం ఎన్జీవో అధ్యక్షుడు కోడి రాములు..

మునుగోడు (విజయక్రాంతి): బ్రాహ్మణ వెళ్ళాంల ప్రాజెక్టు ద్వారా మునుగోడు మండలంలోని చెరువులను నింపేందుకు స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవ చూపాలని అక్షరం ఎడ్యుకేషన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు కోడి రాములు విజ్ఞప్తి చేశారు. సోమవారం మునుగోడులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల నల్గొండ నియోజకవర్గంలోని పలు గ్రామాల చెరువులను నింపేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టారన్నారు. ఇందులో భాగంగానే నల్లగొండ మండలంలోని పలు చెరువులను నింపుతున్నారని తెలిపారు. చిట్యాల మండలం ఎలికట్టే మీదుగా కిస్టాపురం వరకు ప్రధాన కాలువ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రాజెక్టు నీటితో చెరువులు నింపాలని విజ్ఞప్తి చేశారు.

కిష్టాపురం చెరువు నుండి ఇప్పర్తి తాళ్ల వెల్లంల మునుగోడు పెద్ద చెరువుతో పాటు పులిపలుపుల గూడపూర్ చెరువులను గొలుసు కట్టు విధానం ద్వారా నింపే అవకాశం ఉంటుందన్నారు. చెరువులు నింపడం వలన భూగర్భ జలాలు పెరగడంతో బోర్ల ద్వారా సాగు చేసే  రైతులకు మేలు కలుగుతుందన్నారు. ప్రస్తుతం మండలంలోని పలు గ్రామాల రైతులు తమ పొలాలకు నీళ్ల ట్యాంకర్ల ద్వారా పంటలను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే విద్య వైద్యం రవాణా అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగానే సాగునీటి విషయంపై అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.