ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్(Adilabad) పట్టణంలోని తిరుపల్లి సమీపంలో ఆగిపోయిన రహదారి నిర్మాణానికి సహకరించాలని అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్(MLA Payal Shankar) స్థానిక ప్రజలను కోరారు. శుక్రవారం రహదారి నిర్మాణం వల్ల ఇళ్లను కోల్పోతున్న స్థానిక ప్రజలతో ఆయన మాట్లాడారు. రోడ్డు నిర్మాణం వల్ల పట్టణ అభివృద్ధి తో పాటు ప్రయాణికులకు మేలు జరుగుతుందని ఆయన అన్నారు. ఇళ్ల యజమానులు ముందుకు వస్తే వారికి రావలసిన నష్టపరిహారం వచ్చేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గొర్ల రాము ఆదిత్య ఖండేష్కర్, పలువురు కాలనీవాసులు ఉన్నారు.