27-02-2025 05:19:11 PM
నాగల్ గిద్ద,(విజయక్రాంతి): నాగల్ గిద్ద మండల కేంద్రంలోని శివాలయం ప్రాంగణంలో అఖండ హరినమ సప్తః పండర్పూర్ అంబాదాస్ మహారాజ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. హరినామ సప్త 20వ తేదీ రోజు ప్రారంభమై 27 రోజు చివరి రోజు కావున ఆలయ ప్రాంగణం భజన పండర్పూర్ వారకరి భజన కార్యక్రమం నిర్వహించారు. శివనామస్మరణంతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. శివరాత్రి పర్వదినం సందర్భంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి శివుని దర్శనం తీసుకొని మహా ప్రసాదాన్ని స్వీకరించారు.
అలాగే నియోజకవర్గ శాసనసభ్యులు పట్లోళ్ల సంజీవ రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం అంబదాసు మహారాజ్ నిర్వహించిన భజన కార్యక్రమంలో పాల్గొని శాసనసభ్యులు మాట్లాడుతూ... ఆలయానికి విచ్చేసిన భక్తుల కోసం అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నానని నియోజకవర్గ ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరం కలిసి అభివృద్ధికి తోడ్పడతామన్నారు. అంబాదాసు మహారాజు చెప్పిన మార్గంలో నడవాలని నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రజలు ఆ భగవంతుని ఆశీస్సులు తీసుకొని సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. అనంతరం అంబాదాసు మహారాజ్ నారాయణఖేడ్ శాసనసభ్యులు సంజీవరెడ్డికి శాలువాతో సన్మానం చేశారు. కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సచిన్ పటేల్, తాజా మాజీ సర్పంచులు గుండె రావు, అనిల్ పటేల్, పిఎసిఎస్ చైర్మన్ శ్రీకాంత్, మాజీ ఎంపిటిసి పండరినాథ్, సంజీవరావు పటేల్, మనోహర్ రావు పటేల్, నారాయణా, నాగలిగిద్ద గ్రామ పెద్దలు పాల్గొన్నారు.