12-04-2025 11:36:47 PM
సిర్గాపూర్: సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ గ్రామంలో ఈరోజు యాసంగి జొన్న, వరి ధాన్యం సొసైటీ, ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రైతుల పండించిన చివరి గింజల వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రైతుల పార్టీ కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏళ్ల వేళల అండగా ఉంటూ రైతులకు కావలసిన వ్యవసాయ పనిముట్లు సబ్సిడీ ద్వారా అందిస్తున్నాం అని, పేద ప్రజలకు ఉచితంగా సన్న బియ్యం అందిస్తున్నామని రైతులకు సన్న వడ్లకు 500 బోనస్ ఇవ్వడంతో సన్న వడ్లను రైతులు పండించడానికి ఆసక్తి చూపుతున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మనీష్ పాటిల్, యాదవ్ రెడ్డి, సొసైటీ ఛైర్మెన్ ప్రతాప్ రెడ్డి, అగ్రికల్చర్ ఏఈఓ సమతా రెడ్డి రమేష్ చౌహన్, సొసైటి శ్రీకాంత్ రెడ్డి, ఐకేపీ రాములు, రామ్ రెడ్డి, మనోహర్ రెడ్డి, హాజీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.