08-04-2025 12:00:00 AM
నాగల్ గిద్ద, ఏప్రిల్ 7: నాగల్ గిద్ద మండలంలోని శేరిదామరగిద్ద గ్రామంలో ప్రభుత్వం పంపిణీ చేసిన సన్నబియ్యం కార్యక్రమంలో భాగంగా దళితవాడ నడిమిదొడ్డీ వైజినాథ్ ఇంట్లో మండల కార్యకర్తలతో కలిసి నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి భోజనం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి పేదవాడి కడుపు నింపాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున సన్నబియాన్ని పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సచిన్ పాటిల్, పండరినాథ్ తాజా మాజీ ఎంపీటీసీ,గణపతి రావు, శరణప్ప శేరీకర్, కుషాల్ రావు, రవీందర్,బసవరాజు పాటిల్, కుమార్, శ్రీకాంత్ పిఎసిఎస్ చైర్మెన్, అంజి రెడ్డి పిఎసిఎస్ వైస్ చైర్మన్ అనిల్ పాటిల్, మాజీ సర్పంచ్ రూప్ సింగ్, మాజీ జడ్పీటీసీ అబ్దుల్ రహీం, వై.పండరి పాల్గొన్నారు.