జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్
జగిత్యాల, (విజయక్రాంతి): ప్రపంచం దేశాల చూపు భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయాల వైపు ఉందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రమైన జగిత్యాల పద్మనాయక కళ్యాణ మంటపంలో వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో సోమవారం గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ మన సంస్కృతి, సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించటం అందరి బాధ్యత అని, ప్రపంచం చూపు మన సంస్కృతి సంప్రదాయాల వైపు ఉందన్నారు. ఎన్ని విభిన్న కుల మతాలున్న ఐకమత్యంతో మెలగడం మన సంస్కృతిలో భాగం అన్నారు.వెలమ సంక్షేమ మండలి సభ్యులు కొన్నేళ్ళుగా మట్టి గణపతి ఏర్పాటు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారని కొనియాడారు. అన్ని వర్గాల ప్రజల కలుపుకుపోయే స్వభావం వెలమ కులస్తులదని అందరికీ ఆదర్శంగా సామాజిక సేవా, సహాయ కార్యక్రమాలలో ముందుంటార ఆకాంక్షించారు. ప్రతి ఏటా చదువులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉపకార వేతనాలుఅందించడం అభినందనీయం అని ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్ పేర్కొన్నారు.