calender_icon.png 5 October, 2024 | 2:42 AM

నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి

04-09-2024 06:05:21 PM

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ 

జగిత్యాల,(విజయక్రాంతి): నిరుద్యోగ యువతీ, యువకులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని, అవసరమైన ఏర్పాట్లు చేస్తామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రానికి సుదూర ప్రాంతాల నుండి అనేక మంది యువతీ, యువకులు లైబ్రరీలో చదువుకొని పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న వారికి మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించనున్న ట్లు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ బుధవారం తెలిపారు. లైబ్రరీలో కరెంట్, స్టేషనరీ సమస్య తన దృష్టికి వచ్చిందని పరిష్కరిస్తా నని హామీ ఇచ్చారు.

రూ.1 కోటితో నిర్మిస్తున్న లైబ్రరీ భవనం పూర్తి చేసి జిల్లా గ్రంథాలయం సొంత భవనం లోకి మార్చేలా చొరవ తీసుకుంటా నని, పంచాయతీలలో లైబ్రరీ సెస్సు వసూలు చేసేలా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, లైబ్రరీల బలోపేతానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో  బిసి స్టడీ సెంటర్ తో నిరుద్యోగ యువత కు పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యేలా  స్టడీ సెంటర్ ఏర్పాటు చేయాలని బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఫోన్లో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్  శకుంతల, మాజీ లైబ్రరీ డైరెక్టర్ చెట్ పల్లి సుధాకర్, కౌన్సిలర్లు కూసరి అనిల్, ముస్కు నారాయణ రెడ్డి, యూత్ నాయకులు కత్రోజ్ గిరి, ఏంఏ అరిఫ్, చిట్ల మనోహర్, జంగిలి శశి, రామ కృష్ణారెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.