calender_icon.png 15 January, 2025 | 9:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే సంజయ్ ఓ షాడో కాంట్రాక్టర్

14-01-2025 12:27:01 AM

సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకట్ రెడ్డి

జగిత్యాల అర్బన్, జనవరి13: జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్’కుమార్ ఓ షాడో కాంట్రాక్టరని, కేవలం డబ్బుల కోసమే పార్టీ మారాడని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత ఆరోపించారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్’రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్’ను మీది ఏ పార్టీ అని అడిగారు, అందులో తప్పేముందని ప్రశ్నించారు.

ఎమ్మెల్యే సంజయ్ కెసిఆర్ బొమ్మతో గెలిచిన వ్యక్తి అని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీ మారితే ఎవరికి అభ్యంతరం ఉండదన్నారు. ఎమ్మెల్యే సంజయ్ ఓ బినామీ కాంట్రాక్టరని, కాంట్రాక్టు డబ్బుల కోసం, సొంత పనుల కోసమే పార్టీ మారాడని వసంత ఆరోపించారు.

సంజయ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ టికెట్’పై గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో ఏఎంసీ మాజీ చైర్మన్ శీలం ప్రియాంక ప్రవీణ్, ఉదయశ్రీ తదితరులు పాల్గొన్నారు.