calender_icon.png 8 April, 2025 | 5:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐకేపీ సెంటర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే సామెల్

08-04-2025 01:20:24 AM

యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 7 (విజయ క్రాంతి):  మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామంలో  ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తుంగతుర్తి ఎమ్మెల్యే  సామ్యూల సోమవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతన్నలు ధాన్యాన్ని ఐకెపి సెంటర్ల ద్వారా అమ్మి మద్దతు ధర, బోనస్ పొందాలని సూచించారు. తమ ప్రభుత్వం రైతు పక్షపాతి అని ఈ నేపథ్యంలోనే రైతు రుణమాఫీ చేసి అన్ని రకాలుగా రైతాంగాన్ని ఆదుకోవడానికి కృషి చేస్తుందన్నారు.

గత ప్రభుత్వం దోపిడి చేసి దోచుకుని పోయినందున ప్రభుత్వ వద్ద డబ్బులు లేక ఇబ్బందులు గురవుతున్న రైతాంగాన్ని ఆదుకోవడమే తన లక్ష్యం అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. మధ్య దళారీల కు అమ్మి  మోసపోవద్దని, ఐకెపి సెంటర్లను సద్విని చేసుకోవాలని కోరారు.

ఐకెపి సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఏర్పాటు చేయడంలో ఏపిఎం వెంకటేశ్వర్లు విఫలమైనాడని భావించిన కలెక్టర్ అతనికి షోకేస్ నోటీసులు జారీ చేశారు. 

ఈ కార్యక్రమంలో  సహకార సంఘం చైర్మన్ శ్రీ పి.వెంకటేశ్వర్లు గారు , డి.బాలాజీ మండల పరిషత్ అభివృద్ధి అధికారి గారు , యం. ఉపేందర్ డిప్యూటీ తహసిల్దారు గారు,  కీర్తన అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, పి. వెంకటేశ్వర్లు  ఎ.పి.యం, ఐ.కె.పి. సిసిలు ,  కమిటీ మెంబర్లు  మరియు రైతులు పాల్గొన్నారు.