04-03-2025 01:04:34 AM
పాపన్నపేట, మార్చి 3: మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు సోమవారం నాడు పాపన్నపేట మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. మండలంలోని చిత్రియాల్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన గంగమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం లో ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అలాగే గంగమ్మ దేవాలయంలో సొంత నిధులతో బోరును వేయించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముత్యాల పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంకు హాజరు కావాలని ఎమ్మెల్యేకు ఆహ్వానం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే గత శుక్రవారం మంబోజిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం లో గాయపడ్డ గాంధారిపల్లి గ్రామానికి చెందిన తామస్ రెడ్డిని పరామర్శించారు.