జగిత్యాల అర్బన్, జనవరి 2: మిషన్ భగీరథ, అమృత్ 2.0 అభివృద్ధి పనులపై గురువారం జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జగిత్యాల, రాయికల్ పట్టణములోని అన్ని వార్డులు, జగిత్యాల పట్టణం నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనిలో డబల్ బెడ్రూం ఇండ్లకు మిషన్ భగీరథ, అమృత్ 2.0 కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులపై ఆర్డబ్ల్యుఎస్, పబ్లిక్ హెల్త్ ఈఈ, డిఈ, ఏఈలతో సమీక్ష సమావేశం నిర్వహించి పనులు త్వరిత గతిన ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని, ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు.
రాబోయే వేసవి కాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన భాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందని, ఎప్పటికప్పుడు పనుల పురోగతిని పరిశీలిస్తానని అన్నారు. ఈ సమావేశంలో కమిషనర్ చిరంజీవి, ఈఈలు సంపత్’రావు, శేఖర్’రెడ్డి, మున్సిపల్ అధికారులున్నారు.